Free bus in AP – ఉచిత బస్ పథకం అమలు తేదీ వెల్లడి

UJJI NEWS (MAY 17) : Free bus in AP from August 15th. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Free bus in AP from August 15th.

ఎన్నికల హామీలలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

దీని ప్రకారం ఇప్పటికే మార్గదర్శకాలు కొరకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు.

ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

FOLLOW US

@WHATSAPP

@INSTAGRAM