UJJI NEWS (MAY 16) : President Droupadi Murmu Questioned Supreme Court. రాష్ట్రపతి మరియు రాష్ట్రాల గవర్నర్లకు బిల్లుల ఆమోదానికి గడువు ఎలా విధిస్తారు అంటూ సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్రౌపది మర్ము ప్రశ్నించారు.
President Droupadi Murmu Questioned Supreme Court
గవర్నర్ల బిల్లులు పెండింగ్ పెట్టడం ఇటీవల సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలు
రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గాని గవర్నర్ గాని కచ్చితంగా గరిష్టంగా ళమూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపడమో చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపాలనుకుంటే అందుకు తగు కారణాలను పేర్కొనాలి. గవర్నర్ల ఆలస్యపూరిత చర్య న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ అధికరణ 142 ద్వారా న్యాయ సమీక్ష అధికారం మాకు ఉంది.
రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలు
1) గవర్నర్ ఆమోదించకుండా బిల్లును చట్టంగా అమలు చేయొచ్చా.?
2) గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారాలతో సుప్రీంకోర్టు పక్కన పడేయవచ్చా.?
3) రాజ్యాంగంలోని 200 అధికరణ కింద తనకు సమర్పించిన బిల్లుపై గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ప్రత్యామ్నాయాలు ఏమిటి?
4) తన వద్దకు బిల్లు వచ్చినపుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద తనకు గల అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూనే మంత్రివర్గ సూచనలు, సలహాలకు గవర్నర్ కట్టుబడి ఉండాలా?
5) రాజ్యాంగపరమైన విచక్షణాధికారాలను గవర్నర్ ఉపయోగించుకోవడం న్యాయ సమ్మతమా, కాదా?
6) బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్కు ఉన్న ఆప్షన్లు ఎన్ని.?
7) రాష్ట్రపతి నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి.?
8) బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు సలహాల కోసం కచ్చితంగా సంప్రదించాలా.?
9) చట్టంగా మారబోతున్న బిల్లులోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వొచ్చా.?
10) రాజ్యాంగంలో కాలావది ప్రస్తావన లేనప్పుడు మీరెలా రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తారు.?
11) సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 131 కింద కాకుండా మరి ఇతర అధికరణ కింద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా.?
12) ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు దఖలు పడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి.? వంటి విధానా నిర్ణయానికి పరిమితమా లేదంటే పరిపాలన, చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాలు ఇతర అంశాల కు విస్తరించాయా.?
13) ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 361 కింద న్యాయ సమీక్ష జరుపుతుందా.?
14) రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్ పెండింగ్లో పెడితే ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు సలహాల కోసం సంప్రదించాలా.? ఒకవేళ సంప్రదించిన కోర్టు ఇచ్చే సలహాలు సూచనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా.?
- AKHANDA2 TEASER – అఖండ 2 టీజర్
- INTER EXAMS HALL TICKETS – ఇంటర్ సప్లిమెంటరీ హల్ టికెట్లు
- THALLIKI VANDANAM – జూన్ లో తల్లికి వందనం – బాబు
- Free bus in AP – ఉచిత బస్ పథకం అమలు తేదీ వెల్లడి
- GPO JOBS – గ్రామ పాలనాధికారి పరీక్ష తేదీ & హల్ టికెట్లు

